ఓ తాగుబోతు ఫుల్లుగా తాగేసి రైలు పట్టాలపై పడుకున్నాడు. అయితే, అతని పై నుంచి రైలు వేగంగా దూసుకెళ్లింది.. ఇక అతడు కన్ఫామ్‌గా చనిపోయి ఉంటాడని భయపడిపోయిన లోకో పైలట్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ కనిపించిన సీన్ చూసి కంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మందుబాబుల వింత చేష్టలు మామూలుగా ఉండవు.. ఒక్కోక్కడిది ఒక్కో టాలెంట్.. మనల్నేవడ్రా అపేది అన్నట్టుగా ఎవరికైనా ఎదురుగా వెళ్తుంటారు. కాలనాగును కూడా కరకర నమిలేస్తుంటారు. తాగిన మైకంలో ఒకడు హై ఓల్టేజ్ టవర్ ఎక్కి నిద్రపోతే, మరొకడు.. ఫుల్లుగా తాగి రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు. తాను ఎక్కడ పడుకున్నానో కూడా తెలియకుండా ఆ పట్టాలపైనే హాయిగా నిద్రపోయాడు. అయితే అదే సమయంలో ఓ ట్రైన్ అటు వైపు నుంచి దూసుకొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ తాగుబోతు ఫుల్లుగా తాగేసి రైలు పట్టాలపై పడుకున్నాడు. అయితే, అతని పై నుంచి రైలు వేగంగా దూసుకెళ్లింది.. ఇక అతడు కన్ఫామ్‌గా చనిపోయి ఉంటాడని భయపడిపోయిన లోకో పైలట్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ కనిపించిన సీన్ చూసి కంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పట్టాలపై పడుకుని ఉండగా, మీద నుంచి రైలు దూసుకెళ్లింది.. కానీ అదృష్టవశాత్తు అతడు తప్పించుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో బిజ్నోర్ నగరంలోని అడంపూర్ రైల్వే క్రాసింగ్ వద్ద ఒక వ్యక్తిని రైలు ఢీకొని ఉండవచ్చని లోకోపైలట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పట్టాలపై పడివున్న అతడు సురక్షితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని నిద్రలేపి ఆరా తీయగా, సదరు తాగుబోతు నేపాల్‌కు చెందిన అమర్ బహదూర్‌గా తెలిసింది. తాగిన మైకంలో అతడు రైలు పట్టాలపైనే నిద్రపోయినట్టుగా చెప్పాడు. రైలు మీద నుంచి వెళ్లినా అదృష్టవశాత్తూ అమర్ బహదూర్ బతికే ఉన్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ వ్యక్తి ట్రాక్‌పై నుంచి లేవడం వీడియోలో కనిపిస్తోంది. ముస్సోరీ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లినా అతడికి ఎలాంటి గాయం కాకుండా సురక్షితంగా పైకి లేచాడు. ఆ తర్వాత బహదూర్‌ని నార్మల్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు
Also read
- TG Crime: మూడు ప్రాణాలు బలిగొన్న అక్రమ సంబంధం..సంగారెడ్డి జిల్లాలో విషాదం
- Telangana: ఏం తెలివిరా నీది.. అధునాతన టెక్నాలజీతో నకిలీ కార్డ్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితార్!
- వివాహేతర సంబంధం: భర్తను సర్జికల్ బ్లేడుతో హత్య చేసిన భార్య..!
- ఇదేం ప్రేమరా బాబు.. భార్య అందాన్ని తట్టుకోలేక భర్త పిచ్చి పని..
- వివాహిత ఆత్మహత్య