April 11, 2025
SGSTV NEWS
NationalUttar PradeshViral

Watch Video: స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి.. స్టాఫ్‌ రూమ్‌లోనే ఇలా కుమ్మేసుకున్నారు..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని ఓ సెకండరీ స్కూల్‌లో మహిళా ప్రిన్సిపాల్‌, టీచర్‌ మధ్య భీకర గొడవ జరిగింది. ఉపాధ్యాయురాలు పాఠశాలకు ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు ఆమెను అడ్డుకుని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం కాస్త చినికి చినికి గాలివానగా మారింది. మాట మాట పెరిగిపోయి తీవ్ర ఘర్షణగా మారింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాక్కోవడం, తన్నుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించారు. కాని ఇద్దరూ సహనం కోల్పోయారు. ఈ ఘటనతో పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

యూపీలోని ఆగ్రా జిల్లాలోని ఓ సెకండరీ స్కూల్‌లో మహిళా ప్రిన్సిపాల్, టీచర్ మధ్య గొడవ జరిగింది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం క్రమంగా ఘర్షణగా మారింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

https://twitter.com/DeepikaBhardwaj/status/1786426789449130200?t=tZpXMRiDGyTUYbYbJAgJlA&s=19

దీనికి సంబంధించి పాఠశాల యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సదరు టీచర్‌ పాఠశాలకు ఎందుకు ఆలస్యంగా వచ్చారనేది కూడా తెలియరాలేదు. అయితే ఈ ఘటన విద్యావ్యవస్థపై మరోసారి ప్రశ్నార్థకంగా మారడంతో పాటు పాఠశాలల్లో క్రమశిక్షణ పాటించాల్సిన ఆవశ్యకతను చాటింది.

Also read

Related posts

Share via