సాంబార్ విషయంలో దంపతుల మధ్య జరిగిన వివాదం భార్య మృతికి దారితీసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దేవనహళ్లి తాలూకా సావకనహళ్లి గ్రామానికి చెందిన నాగరత్న అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే శవమై కనిపించింది. నాగరత్నం ఇంట్లోనే ఉరివేసుకుని మరణించినట్టుగా ఆమె భర్త, పిల్లలు చెబుతున్నారు. అంతకు ముందు ఇద్దరి మధ్య సాంబార్ విషయంలో వాగ్వాదం జరిగిందని, దాంతో మనస్తాపానికి గురైన నాగరత్నం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విశ్వనాథ్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే, తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఆర్థిక సమస్యలతోనే తన భర్త ఈ హత్య చేశాడని మృతురాలి సోదరుడు, తల్లి ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఆమె భర్త, పిల్లలు సాంబార్ విషయంలో గొడవపడి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఈ మేరకు ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నాగరత్నం మర్డర్ మిస్టరీని చేధిస్తామని చెప్పారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..