November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

మోటర్ బైక్ పై మృతదేహం తరలింపు

రాజవొమ్మంగి : అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఐదు కిలోమీటర్లు బైక్ పై తరలించిన సంఘటన సోమవారం అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి పీహెచ్సీ పరిధిలో చోటుచేసుకుంది. మండలం జడ్డంగి ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో అంబులెన్సు రిపేరులో ఉండడంతో రోగులకు ఎటువంటి సేవలు అందించకపోవడం వలన జడ్డంగి పిహెచ్సి పరిధిలో సుమారు 30 గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుచున్నారు. జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మిరియాలవీధి గ్రామానికి చెందిన కుంజం అన్నపూర్ణ 60 అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం వైద్య సేవలు నిమిత్తం వారి బంధువు సహాయంతో వచ్చి వైద్యసేవలు పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా ఆమె కుమారుడు లారీ డ్రైవర్ గా పనిచేయడానికి బెంగళూరు వెళ్ళాడు. ఆసుపత్రి నుండి మృతదేహాన్ని ఇంటికి చేర్చడానికి ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో విషయం తెలుసుకున్న జడ్డంగి లారీ ఓనర్స్ యూనియన్ నాయకుడు గణజాల మల్లిఖార్జున్ అంబులెన్స్ కోసం ప్రయత్నించి ఫలితం లేకపోవడంతో అతని ద్విచక్ర వాహనం మీద కుంజం అన్నపూర్ణ మృతదేహాన్ని 5కిలోమీటర్లలో వున్న వారి స్వగ్రామం మిరియాలవీధి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు, అంబులెన్సు సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని, దీనిపై అత్యంత శ్రద్ద చూపాలని రాజవొమ్మంగి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సొసైటీ అధ్యక్షులు గణజాల తాతారావ్, తదితరులు అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ని కోరారు.

Also read :Watch Video: వెండి ఆభరణాలకు మెరుగుపెట్టి.. ఆ పనిచేస్తూ దొరికిపోయిన మోసగాళ్లు..
భార్య, కుమార్తెను హతమార్చి.. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

పల్నాడు జిల్లా.*కలెక్టర్ సీసీ జానీ బాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ ఆరోపణ*..వీడియో

Related posts

Share via