April 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఖమ్మంలో విషాదం.. నీటిలో మునిగి తండ్రీ కుమారుడు మృతి

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు మృతి చెందాడు. మృతులు పఠాన్ యూసుఫ్ మియా (65), కుమారుడు కరీముల్లాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

TG Crime: ఖమ్మం జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు కూడా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో పఠాన్ యూసుఫ్ మియా (65)కి మతిస్థిమితం లేదు. ఇంటి సమీపంలోని ఊర చెరువులోకి దిగాడు. నీటిలో మునిగిపోతున్న తండ్రిని గమనించిన కుమారుడు కరీముల్లా తండ్రిని కాపాడుదామని చెరువులోకి దిగాడు.

కాపాడే ప్రయత్నం చేసినా..

అయితే గతంలో చెరువులో ప్రోక్లైన్ల ద్వారా పెద్ద పెద్ద గోతులు తీసి మట్టిని తరలించారు. దీంతో లోతును అర్థం చేసుకోలేక కుమారుడు కూడా తండ్రితో పాటే చనిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత తండ్రీ కుమారుల మృతదేహాలను వెలిసి తీశారు. రంజాన్‌ పర్వదినాన ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూసుఫ్ మియాకు భార్య ముగ్గురు కొడుకులు. కరీముల్లాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via