ముదినేపల్లి (ఏలూరు జిల్లా) : ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చేపల చెరువులో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా ముదినేపల్లి పంచాయతీ శివారు అన్నవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం గ్రామానికి చెందిన బట్టు సురేష్‌బాబు, రాణి దంపతులకు ఒక కుమారుడు కుమార్ (7), కుమార్తె వర్ణిక(5) ఉన్నారు. సురేష్‌బాబు లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. సురేష్‌బాబు ఆదివారం డ్యూటీకి వెళ్లారు. సోమవారం మధ్యాహ్న సమయంలో అన్నాచెల్లెళ్లు ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న చేపల చెరువులో జారి పడ్డారు. పిల్లలు ఇంటి వద్ద కనిపించకపోవడంతో తల్లి రాణి చుట్టుపక్కల గాలించగా కుమార్తె చెరువులో నీటిపై తేలియాడుతూ కన్పించింది. వెంటనే బయటికి తీసి ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుమారుడి కోసం కుటుంబ సభ్యులు చెరువులో దిగి వెతకగా కుమార్ మృతదేహం లభ్యమైంది. గ్రామ విఆర్‌ఒ మధుసూదన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతికి గల కారణాలను సేకరించారు. గతేడాది చేపల చెరువును ఆక్వా రైతు మరమ్మతుల పేరుతో లోతుగా తవ్వినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025