SGSTV NEWS
Andhra PradeshCrime

రఘురామకు చిత్రహింసల కేసు.. ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకు హాజరైన విజయ్ పాల్



సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఒంగోలు: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో వైసీపీ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆయనను విచారిస్తున్నారు.

ఈ కేసులో ఈనెల 13న పోలీసులు విజయ్ పాల్ ను విచారించారు. తనకేమీ తెలియదు.. గుర్తులేదు అంటూ ఆయన అప్పట్లో విచారణాధికారుల ఎదుట చెప్పారు.

మరోవైపు ఈ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 24న ఇచ్చిన తీర్పుపై ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషనన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ క్రమంలో విజయ్పాల్ నేడు విచారణకు హాజరుకావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

Also read

Related posts

Share this