November 21, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకమలు 15 అక్టోబర్, 2024



మేషం (15 అక్టోబర్, 2024)

మీకు అదనంగా మిగిలన సమయంలో, మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి, మీకు బాగా నచ్చే పని చెయ్యండి. ఎప్పటినుండో మీరుచేస్తున పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది,కానీ ఖర్చులు మిమ్ములను భాదిస్తాయి. మీ అంచనాలమేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు. మీరువారిని ఉత్సాహపరచి మీ కలలను నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు, తప్పవు- మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

లక్కీ సంఖ్య: 3

వృషభం (15 అక్టోబర్, 2024)

విచారంలో ఉన్నవారికి మీ శక్రిని వాడి సహాయం చెయ్యండి. గుర్తుంచుకొండి, ఇతరుల అవసరాకు ఉపయోగపడ లేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల అర్థమేముంది, ఏమీలేదు. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పని నైపుణ్యాలను మెరుగు పరచుకోవడం, క్రొత్త చిట్కాలు/ టెక్నిక్ లను అవలంబించడం అనేవి, ఉద్యోగంలో పైకి ఎదగడానికి అవసరమౌతాయి. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటిఅంటే స్నేహితులతోకల్సి బయటికివెళ్లి సరదాగాగడపటంవంటివి చేయద్దు,ఈ సమయము మీయొక్క జీవితానికిచాలాముఖ్యమైనది.కావున చదువుపట్ల శ్రద్దచూపించి ముందుకువెళ్ళండి. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు.

లక్కీ సంఖ్య: 2

మిథునం (15 అక్టోబర్, 2024)

మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది వ్యాపారస్తులు వారి వ్యాపారముకోసము ఇంటినుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్నిజాగ్రతగా భద్రపరుచుకోవాలి లేనిచో మీధనము దొంగిలించబడవచ్చు. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. చాలాకాలంగా చేయాల్సిన ఉత్తరప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. మీరు ఎప్పుడో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగినందుకు, ఈ రోజు బోలెడంత సంతృపి కలుగుతుంది. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.

లక్కీ సంఖ్య: 9

కర్కాటకం (15 అక్టోబర్, 2024)

మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మ విశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీసమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరల ఆత్మ విశ్వాసం పొందడానికి మరొక్కసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను, హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఈరోజు,మీ తల్లితండ్రులు మీకు పొదుపుచేయుటకొరకు హితబోధ చేస్తారు.మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరుఅనేక సమస్యలను ఏదురుకుంటారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.- అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. మీ మూడీ ప్రవర్తన, మీ సోదరుని మూడ్ ని పాడుచేయవచ్చును. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. ప్రేమను అనుభూతిచెందగలరు. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలాకాలం తరువాత సమయము దొరుకుతుంది.కానీ, ఎక్కువగా ఇంటిపనులకొరకు సమయాన్ని కేటాయించవల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది.

లక్కీ సంఖ్య: 3

సింహం (15 అక్టోబర్, 2024)

మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ఒకసారి మీరు మీ జీవితేశ్వరిని/జీవితేశ్వరున్ని కలిశారంటే మరింకేమీ అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లోఉన్నారోవారికి అనుకున్నఫలితాలు సంభవిస్తాయి.ఈరాశిలోఉన్న ఉద్యోగస్తులుకూడా వారిపనితనాన్నిచూపిస్తారు. ఈరాశికి చెందినవారు పొగాకుకు,మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి.ఎందుకంటే ఇదిమీయొక్క సమయాన్ని పూర్తిగా వృధాచేస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు.

లక్కీ సంఖ్య: 2

కన్య (15 అక్టోబర్, 2024)

మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీ రొమాంటిక్ మూడ్ లో అకస్మిక మార్పు వలన మీరు అప్ సెట్ అవుతారు. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు.

లక్కీ సంఖ్య: 9

తుల (15 అక్టోబర్, 2024)

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులనుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలాముఖ్యం. మీకు తెలియకుండా మీరుచెప్పే విషయాలు మీయొక్క కుటుంబసభ్యలను భాదకు గురిచేస్తాయి.దీనికొరకు మీరు మిసమయమును మొత్తము కేటాయిస్తారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి.

లక్కీ సంఖ్య: 3

వృశ్చిక (15 అక్టోబర్, 2024)

మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది. మీపనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగిఉండండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మ్మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది.కానీ అదృష్టముకొద్దీ మీకు ఈరోజు ఆసమయము దొరుకుతుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.

లక్కీ సంఖ్య: 4

ధనుస్సు (15 అక్టోబర్, 2024)

మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెంజీగా, పిచ్చివానిలా చేసెస్తాయి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. పెద్దవారు, కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను కనబరుస్తారు. ఈరోజు మీ స్వీట్ హార్ట్ తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. మీరు ఈరోజు మంచి నవలనుకాని,మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలంగడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు.

లక్కీ సంఖ్య: 1

మకరం (15 అక్టోబర్, 2024)

మీ సంతోషాన్ని భయం చంపెయ్యగలదు. అది మీలో స్వంతంగా పుట్టే ఆలోచనల వలన, ఊహలవలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది మీ ధారాళత శక్తిని, జీవించడంలోని ఆనందాన్ని, పారిపోయేలా చేస్తాయి. మీ సామర్థ్యాన్ని పనికి రాకుండా చేతగానితనంగా మార్చెస్తుంది. కనుక మొగ్గదశలోనే దానిని త్రుంచివెయ్యండి, లేకపోతే అది మిమ్మల్ని పిరికివారిగా తయారుచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరుఎంమీజీవితభాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు.అయినప్పటికీ మీరు మీయొక్క ప్రశాంత వైఖరివలన అన్నిటిని సరిచేస్తారు. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్ గా చేస్తాయి- అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అదికూడా మీమాటలను ఎక్కువ పట్టించుకునేవారికి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. ఈరాశికిచెందిన ట్రేడ్ రంగాల్లోవారికి ,మీస్నేహితుడియొక్క తప్పుడు సలహాలవలన కొన్ని సమస్యలు ఎదురుకుంటారు,ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది!

లక్కీ సంఖ్య: 1

కుంభం (15 అక్టోబర్, 2024)

ఒళ్ళునొప్పులు, వత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు. తోబుట్టువులయొక్క సహాయసహకారముల వలన మీరు ఆర్ధికప్రయోజనాలను అందుకుంటారు.కావున వారియొక్క సలహాలను తీసుకోండి. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యను అవసరమౌతాయి. ఇలాంటప్పుడు అలసత చూపితే, తరువాత భారీ మూల్యం చెల్లించ వలసి వస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి, మీరు సంతోషంగా ఉండడం కోసమ్ పనులు చేస్తారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు.మీకు కావలసినన్ని సినిమాలు,కార్యక్రమాలు టీవిలో చూస్తారు. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు.

లక్కీ సంఖ్య: 8

మీన (15 అక్టోబర్, 2024)

మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. డబ్బుమీకు ముఖ్యమైనప్పటికీ,మీరు దానిపట్ల సున్నితమగా వ్యవహరించి సంబంధాలను పాడుచేసుకోవద్దు. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు తుడవబడతాయి. సముద్రాలకవతల ఓవర్ సీస్ ఉద్యోగం కోసం అప్లై చేస్తుంటే, ఈరోజు చాలా అదృష్టం కలిసివచ్చేరోజు అనిపిస్తోంది. మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవటం మంచిదే,కానీ మీరు కుటుంబము యొక్క ప్రాయముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకుని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.

లక్కీ సంఖ్య: 6

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్



తాజా వార్తలు చదవండి

Related posts

Share via