తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి
వచ్చింది. వరుసకు కూతురైన మైనర్ పై బాబాయ్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడిని తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామమూర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో తిరుపతి లక్ష్మీపురంలో ఉంటున్న పిన్ని ఇంటికి ఆమె ఇటీవలే వచ్చింది. ఈ క్రమంలో మైనర్‌కు సంబంధించిన నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని రామమూర్తి బెదిరింపులకు దిగాడు. అనంతరం, మైనర్‌ను లొంగదీసుకున్నాడు. అనంతరం, ఇంటికి తిరిగి వచ్చిన మైనర్ ప్రవర్తనలో మార్పులను గుర్తించిన పేరెంట్స్.. అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు.
దీంతో, మైనర్ పేరెంట్స్ వెంటనే జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 28వ తేదీన జీరో ఎన్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం, తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఎఫ్ఎఆర్‌ను బదిలీ చేశారు. ఈ క్రమంలో తిరుపతి పోలీసులు ఆలస్యంగా ఎఫ్ఎఆర్‌ను గుర్తించడంతో ఈనెల 13వ తేదీన క్రైమ్ నెంబర్ 236/2026 పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం, విచారణ చేపట్టినట్టు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!





