*పల్నాడుజిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు – వైసీపీ పనేనన్న …ఎన్డీయే కూటమి నియోజకవర్గ అభ్యర్థి.. భాష్యం. ప్రవీణ్*
పల్నాడు జిల్లా
పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు.
అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించారు.
వైసీపీ శ్రేణులు మా కార్యాలయానికి నిప్పు అంటించారు. మెున్న జరిగిన చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడంతో, తట్టుకోలేక మా కార్యాలయాన్ని తగలబెట్టారు. ఓటమి భయంతోనే మా పార్టీ కార్యలయం తగలబెట్టారు. మేం తలుచుకుంటే వాళ్ల పరిస్థితి మరోలా ఉంటుంది. విజయం కోసం వైసీపీ నేతలు తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటే సహించబోం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు అధికారులు ఘటనపై విచారణ చేపట్టాలి. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.’ – భాష్యం ప్రవీణ్, కూటమి అభ్యర్థి
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





