ఇద్దరు సోదరుల అరాచకపర్వం
ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
నిందితులపై పోక్సో కేసు నమోదు
యలమంచిలి: పదేళ్లుగా ఓ మహిళను లోబరచుకుని మోసం చేసిన సంఘటనపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామానికి చెందిన కుక్కల కూర్మారావు అదే మండలానికి చెందిన ఓ మహిళకు 14 ఏళ్ల వయసుండగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. 2016 మే 1న ఆమె ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడి వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడు.
కూర్మారావు సోదరుడు జ్ఞానేశ్వరరావు ఆ వీడియోలు చూసి తన కోరిక కూడా తీర్చమని ఆమెను వేధించాడు. దీనిపై బాధిత మహిళ కూర్మారావును నిలదీయగా గతేడాది (2025) జూన్ 5న ఆమెకు ఉంగరం తొడిగి… ‘నువ్వు నా భార్య’వని చెప్పి జ్ఞానేశ్వర-రావుపై కేసు పెట్టవద్దని బతిమాలాడు. అనంతరం సెప్టెంబర్ 28న ఆమెను పాలకొల్లులో ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. తర్వాత బాధిత మహిళ గర్భం దాల్చగా ఈ ఏడాది జనవరి 30న హైదరాబాద్ తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి ఆడ శిశువు పురిట్లోనే చనిపోయిందని చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూర్మారావు, అతడి భార్య దుర్గాభవానీ, జ్ఞానేశ్వర-రావు, అతడి భార్య లక్ష్మీభవానీపై పోక్సో కేసు నమోదు చేసి పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ యేలేటి మనోహర్ తెలిపారు.
Also read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





