*
*ఓటేయాలంటే విరక్తి కలిగేలా చేశారు.. సీనియర్ సిటిజన్ ఆవేదన*
*మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ అన్ని కేంద్రాలలో నత్తనడకన సాగుతున్నాయి*
*కుంచనపల్లి లో బూత్ నంబర్ 69 లో శివరామిరెడ్డి అనే సీనియర్ సిటిజన్.. నాలుగు గంటలు లైన్లో నుంచి నరకం అనుభవించాలని… తన ఆవేదనను దీక్ష మీడియాతో పంచుకున్నారు*
*పోలింగ్ రూమ్ లోనికి వెళ్లడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని వాపోయారు… చిన్న డోర్ ముందు 8 సెపరేట్ లైన్లు ఉన్నాయని… అందరూ లోనికి వెళ్లడానికి పోటీలు పడ్డారని… వారి మధ్యలో నలిగిపోయానని బాధపడ్డారు.. తనకి నాలుగు గంటలు సమయం ఓటింగ్ వేయడానికి పట్టిందని… మంచినీళ్లు కూడా అందించలేదని బాధపడ్డారు*
*కొన్నిసార్లు పోలింగ్ యంత్రాలు కూడా మొరాయించాలని…అధికార యంత్రాంగం సమస్యలను చక్కదిద్దకపోతే.. ఓటింగ్ శాతం తగ్గి ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని అన్నారు.*
*తాను అనుభవించిన నరకాన్ని మరొకరు అనుభవించకూడదని మీడియా ముందుకు స్వచ్ఛందంగా వచ్చానని… ఈ వీడియో చూసి అన్న అధికారులు కళ్ళు తెరిచి… సరైన సదుపాయాలు… క్యూలైన్ కంట్రోల్ చేయడానికి తగు పోలీస్ సిబ్బందిని… ఏర్పాటు చేయాలని తెలియజేశారు.*
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
టీడీపీలో కష్టపడిన వారికి సీట్లు ఇవ్వలేకపోయాం.. మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు