గాజువాక (విశాఖ) : ఖాళీ స్థలం విషయంలో వైసిపి నాయకుడికి, స్థానిక మహిళకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైసిపి నేత సదరు మహిళను మంటల్లోకి నెట్టేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖ గాజువాకలో జరిగింది.
న్యూపోర్టు సిఐ దాలిబాబు తెలిపిన వివరాల ప్రకారం … గాజువాక 65వ వార్డు బానోజితోటలో రాధ (35) నివాసం ఉంటోంది. ఆమె ఇంటి పక్కన కొంత ఖాళీ స్థలం ఉండగా.. శుక్రవారం వైసిపి నాయకుడు లోకనాథం అక్కడ చెట్లు నరికి అగ్గి పెట్టాడు. దీంతో రాధ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ స్థలం తనదని.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ అతడిని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో లోకనాథం ఆమెపై చేయి చేసుకున్నాడు. చెట్టు కాలుతున్న మంటల్లోకి తోసేయడంతో ఆమె చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రాధ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. మరోవైపు లోకనాథం తాను ఆ సమయంలో సంఘటనా స్థలంలో లేనని చెబుతున్నాడు. కొద్దిరోజులుగా ఆమె తనపై కక్ష పెట్టుకుని ఫిర్యాదు చేస్తోందని ఆరోపించాడు. దీనిపై సీఐను సంప్రదించగా.. ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టినట్లు చెప్పారు. ఖాళీ స్థలంపై గత కొన్నాళ్లుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
Also read
- రెచ్చిపోయిన పెద్దిరెడ్డి అనుచరులు – టీడీపీ సానుభూతిపరులపై రాళ్లు, వేటకొడవలితో దాడి –
- మేడారం వెళ్లే మార్గంలో వింత ఆకారాలు..! అసలు మ్యాటర్ తెలిస్తే..
- నీటితో తేలియాడుతున్న అదో మాదిరి ఆకారం.. స్థానికులు వెళ్లి చూడగా
- కూతురి ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు.!
- కూతురిని నిద్రలేపుదామని వెళ్లాడు.. దుప్పటి తీసి చూసి కంగుతిన్నాడు. పక్క గదిలో భార్యను చూసి!..