మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వనౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు.
హిందూపురం , : మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా.. రాజశేఖర్ గురువారం గ్రామంలోని వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారు. అనంతరం ఆయన తన పొలం వద్దకు వెళ్లి రాత్రి వస్తుండగా వైకాపా కార్యకర్తలు ఆటోతిమ్మ, లక్ష్మీనారాయణ, రామాంజప్ప, భరత్, జయప్ప, ఆదినారాయణలు అడ్డగించారు. మా వైకాపా జెండా దిమ్మెపై ఎలా కూర్చుంటావని వాగ్వాదానికి దిగి దుర్భాషలాడి దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు వన్లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన వైకాపా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
Also read
- Amarnath Yatra 2025: అమరనాథ్ గుహలో అమరత్వం పొందిన జంట పావురాల గురించి తెలుసా..! వీటి దర్శనం అదృష్టవంతులకే లభిస్తుందట..
- Garuda Purana: గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా.? పండితులు ఏం అంటున్నారంటే.?
- నేటి జాతకములు..4 జూలై, 2025
- ముఖం చూసి అమాయకుడు అనుకునేరు..! శ్రీవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన పేరిట చేతివాటం!
- మీ గోత్రం యొక్క నిజమైన శక్తిని మీకు తెలుసా?