February 24, 2025
SGSTV NEWS
Crime

టిడిపి నేత మహిళపై వేధింపుల ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌

విజయవాడ
6-5-2024

*మహిళలపై వేధింపులు పాల్పడితే కఠిన చర్యలు- గజ్జల వెంకటలక్ష్మి చైర్ పర్సన్ మహిళా కమిషన్*

*టిడిపి నేత మహిళపై వేధింపుల ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌*

*కంకిపాడు కు చెందిన టిడిపి నేత గుమ్మడి కిరణ్ మహిళపై వేధింపులు పాల్పడిన ఘటనపై  మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది*. *ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది*. 

*కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయింది*. *ఈ ఘటన కేసును సుమోటోగా స్వీకరించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని*, పూర్తి వివరాలు వెల్లడించాలని
కృష్ణా జిల్లా ఎస్పీకి మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి లేఖ రాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయం పేరిట ఇటీవల తెలుగుదేశం పార్టీ  కి చెందిన కొంతమంది కీచకులు మహిళలపై చేస్తున్న  అరాచకాలపై ఉక్కు పాదం మోపాలని, వారి భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత  మహిళ వివరాలపై గోప్యత పాటించాలని, రక్షణ కల్పించాలని సూచించారు.

Also read

Related posts

Share via