July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

జగనాసుర సంహారానికి ముహూర్తం ఖరారు చేసిన త్రిమూర్తులు..బ్రాహ్మణ చైతన్య వేదిక  

*రాష్ట్రంలో రాక్షస పాలనని “ఓటు”తో అంతమొందిద్దాం… బ్రాహ్మణ చైతన్య వేదిక         

*ముస్లిం వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు అన్ని కుల వర్గాలవారు కలిసికట్టుగా జగనాసురుడి పాలన అంతం చేస్తూ కూటమి

అభ్యర్థుల్ని గెలిపించుకుందాం బ్రాహ్మణ సమాజం పిలుపు…*

*జగనాసుర సంహారానికి ముహూర్తం ఖరారు చేసిన త్రిమూర్తులు…* 

అమరావతి:
బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం సంయుక్తంగా బ్రాదిపేట 4/9 *రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ* త్రేతా యుగం, ద్వాపర యుగంలలో రాజ్య పరిపాలనలను సక్రమంగా నిర్వహించకుండా రాజులు, ఋషులు,ప్రజలు, దేవతలపై అప్పట్లో రాక్షసులు దాడులకు దిగుతూ హింసలకు గురిచేస్తూ హత్యలు దోపిడీలు చేస్తూ అరాచకం సృష్టించే వారని, అలాంటి సందర్భంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తి రాక్షసులను సంహరించే వారిని అలానే ఈ కలియుగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే అనే రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని మోసం చేసి గత ఐదేళ్లుగా క్రూర రాక్షస పరిపాలన కొనసాగించాడని అతని పాలనలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, అన్ని కుల మత వర్గాల వారు అనేక హింసలకు,దాడులకు గురయ్యారని, రాక్షసుడు అని తెలియక నమ్మి మోసపోయామని ప్రజలు, ప్రతిపక్షాలు వాపోతున్న సమయంలో ఆ త్రిమూర్తులు ఎన్నికల రూపంలో ప్రజల చేతిలో ఈ రాక్షసుడిని అంతమొందించేందుకు  ఈనెల 13 తేదీన ముహూర్తం ఖరారు చేశారని, అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం కుటుంబాలు క్రిస్టియన్ కుటుంబాలు మార్వాడి కుటుంబాలు మరియు వివిధ కులవర్గాలవారు ఈ ప్రభుత్వ విధానాలపై తిరగబడి త్రిమూర్తులు ఇచ్చిన అవకాశాన్ని ఓటు అనే ఆయుధంతో ఈ జగనాసురుడ్ని కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలసి సమహరించాలని అర్చక పురోహిత బ్రాహ్మణ  సంఘాలు పిలుపునిచ్చారు. 

ఈ జగనాసురుడి పాలనలో మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని, గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనే సంస్థను 2016లో ప్రారంభించి, దానికి 280 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలకు కేజీ నుంచి పీజీ వరకు భారతి విద్య ఉపకార వేతనాలు, విదేశీ విద్య సహాయం, వేదవ్యాస వేద విద్య, చాణిక్య ఉపాధి వ్యాపార రుణాలు, కశ్యప వృద్ధాప్య, దైవాంగ,వితంతు పింఛన్లు, గరుడ అంతిమ సంస్కార, పెళ్ళికానుక తదితర ప్రభుత్వ పథకాల ద్వారా మరియు బ్రాహ్మణ కోపరేటివ్- క్రెడిట్ సొసైటీ స్థాపించి దాని ద్వారా గ్రూపు రుణాలు డిపాజిట్లు తదితర ఆర్థిక సహాయాన్ని రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకు చంద్రబాబు ప్రభుత్వం అందజేసిందని బ్రాహ్మణులకు దేశంలో తొలిసారిగా మేలు జరిగిందని, అయితే 2019లో జగన్ ప్రభుత్వం జగనాసురుడి పాలన ప్రారంభం నుండి నేటి వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ను మూలనబెట్టి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యకలాపాలను నిర్వీర్యం చేసి ఐదేళ్లలో పేద మధ్యతరగతి బ్రాహ్మలు ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని, ఇదేకాక రాష్ట్రంలో దేవతా విగ్రహాలను పగలగొట్టి, దేవతా రథాలను తగలబెట్టి, హిందూ ధర్మానికి పెద్దన్న గా ఉన్న బ్రాహ్మణ,అర్చక, పురోహితులపై ఈ ఐదేళ్లలో సుమారు 150 కి పైగా భౌతిక దాడులు చేశారని, ఈ దాడులపై కనీసం ఈ జగనాసురుని ప్రభుత్వం ఖండించకుండా, దాడులు చేసిన వ్యక్తుల్ని శిక్షించకుండా, అర్చక, పురోహితులపై కన్ను మిన్ను కానకుండా గర్భగుడిలో దేవుడు ముందే దాడులపర్వం నేటి వరకు కొనసాగిస్తూనే ఉందని ఆ ఉసురు తప్పకుండా ఈ ఎన్నికల్లో జగనాసురుడికి తగులుతుందని జోస్యం చెప్పారు. ఇదే కాక ఈ ప్రభుత్వంలో దేవాదాయశాఖ నకిలీ అర్చక పరీక్షలు, నకిలీ సర్టిఫికెట్ల పంపిణీ నిర్వహణ కార్యక్రమానికి ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా తెరలేపిందని, దీని ద్వారా దేవాలయ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికి ఈ జగనాసుర ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆరోజున అర్చక బ్రాహ్మణ సంఘాలు ఉద్యమం చేస్తే ఆ పరీక్షలను ఆపివేయడం జరిగిందని, అలానే బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యంతో నడిచే సంస్థ ఎన్నికలను సొసైటీ యాక్ట్ ప్రకారం నిర్వహించకుండా తప్పుడు మార్గంలో సొసైటీని హస్తగతం చేసుకోవాలని దానిలో ఉన్న కోట్ల రూపాయల నిధులను కాజేయాలని ప్రయత్నం చేస్తే దానికి అడ్డుకట్ట వేస్తూ బ్రాహ్మణ చైతన్య వేదిక హైకోర్టులో జగనాసురుని ప్రభుత్వంపై కేసు వేసి స్టే తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. అలానే వంశపారంపర్య అర్చకులకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ ప్రభుత్వం విధివిధానాలు రూపకల్పన చేస్తానని చెప్పి తాస్సారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50వేల దేవాలయాల అర్చకులను, వారి కుటుంబ సభ్యులను మోసం చేసిందని ఈ ఉసురు కూడా తప్పకుండా జగనాసురుడికి తగిలి తీరుతుందని శపించారు, అలానే దేవాలయ దేవుని ఆస్తులను వైసీపీ నాయకులు ఆక్రమించి కబ్జాలు చేశారని ప్రముఖ దేవాలయాల్లో ఎన్నో అపచారాలు ఈ ప్రభుత్వంలో జరిగాయని, తిరుమల తిరుపతిని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకొని స్వామివారి హుండీ డబ్బును వందల కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి మరల్చారని, ఇటువంటి వాటిపై హైకోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసిన ఈ జగనాసురుడిలో ఎటువంటి మార్పు రాలేదని, దేవాలయ పంట భూముల పట్టాదారు పాసుపుస్తకాలు పై జగనాసురుడి బొమ్మ ముద్రించి భవిష్యత్తులో దేవుడి ఆస్తిని ఈ వైసిపి ప్రభుత్వం కాజేయాలని కుట్ర పన్నిందని, త్రిమూర్తులు జగనాసురుడు తప్పులన్నిటికి శాశ్వత శిక్ష, జగనాసుర సంహారం,ప్రజలకు విముక్తి మే 13వ తేదీన ముహూర్తం ఖరారు చేశారని, ఈ ఐదు కోట్ల ఆంధ్రుల హృదయాల్లో భగవంతుడు జొరబడి అసుర సంహారం జరగబోతున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా మూడు రాజధానులు చేసున్నానని, అమరావతి రాజధాని సర్వనాశనం చేశాడని భూములు ఇచ్చిన రైతులు జీవితాలతో కూడా ఆడుకున్నాడని, వారిపై పోలీసులతో దాడులు చేయించాడని, అలిమి గాని తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూసాడని కావున రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు, వివిధ మతాలకు చెందిన మేధావులు ఆలోచించి తక్షణమే జగనాసుర పాలనను అంతమొందించాలని, ప్రతి ఒక్కరూ స్థానిక పోలింగ్ బూతుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రెండు ఓట్లు వేయాలని లేనిపక్షంలో మన రాష్ట్రాన్ని మనమే అధోగతి పాలు,సర్వనాశనం చేసుకున్న వాళ్ళమవుతామని, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కూడా జగనాసురుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కబ్జాలకు గురవుతాయని, హిందూ ధర్మాన్ని సమూలంగా కూకటివేళ్లతో నాశనం చేయటానికి మత మార్పిడుల ద్వారా జగనాసురుడు పక్కా ప్రణాళిక రూపొందించాడని హైందవ కుటుంబాలందరు దీన్ని అడ్డుకోవాలంటే టిడిపి బిజెపి జనసేన మోడీ చంద్రబాబు పవన్ అనే త్రిమూర్తుల కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకొని తీరాలని పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ను అలానే పార్లమెంట్ పరిధిలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించాలని అర్చక, పురోహిత, బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు కొప్పర్తి సీతారమేష్, బొడ్డుపల్లి శ్రీనివాసు, నల్గొండ రాధాకృష్ణమూర్తి బందా శశిధర్, వేదాంతం శ్రీనివాస్, ప్రతాప ప్రసాద్,లంకా రవి,ఐలూరి శ్రీనివాస్, వడ్డమాను ప్రసాద్, చిలుమూరు ఫణి ఐలూరి నాని తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via