దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది.
ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





