కడప జిల్లా: సోషల్ మీడియాలో లైకులు, షేరులు.. పాపులారిటీ కోసం కొందరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ యువకుడు రీల్స్ పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
ముబారక్(20) తన స్నేహితుడితో కలిసి బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. వాటికి కొద్ది కొదద్దిగా వ్యూస్ రావడం ప్రారంభించింది. దీంతో ఎక్కువ వ్యూస్ రావాలనే ఆశతో మితిమీరి స్టంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో..
బైక్ పై విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో ముబారక్ అక్కడికక్కడే మరణించాడు. వెనకాల కూర్చున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనలో స్కూటీ తక్కుతుక్కుగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.
Also read
- అయ్యో.. ఎంత పని జరిగింది.. మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు..!
- AP News: ‘నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా’.. కేటుగాళ్ల కొత్త రకం మోసాలు
- బారువలో నంది విగ్రహం ధ్వంసం
- Rajahmundry:కల్తీ పాలు కేసులో మరో మృతి… మృతుల సంఖ్య 17కి పెరుగుదల.
- మణుగూరు అడవుల్లో విషాదం.. వన్యప్రాణుల వేటలో ఒకరి మృతి! వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి





