పెద్దపల్లిరూరల్: అక్రమసంబంధం నేపథ్యంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేక.. ఈ విషయమై కొంతకాలంగా సదరు యువకుడితో గొడవ జరుగుతున్నా.. అతడిలో మార్పు రాకపోవడం.. తను కాదంటున్న వెంట పడుతున్నాడంటూ భార్య చెప్పడంతో రగిలిపోయిన భర్త.. మాట్లాడుకుందాం రా.. అని పిలిచి కిరాతకంగా చంపేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ (35) తన భార్య అనిత, ముగ్గురు పిల్లలతో పెద్దపల్లిలోనే నివాసముంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్కుమార్కు కుమార్ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లయింది. వరసకు మరదలు అయ్యే శైలజతో కుమార్ చనువుగా మెదలుతుండడాన్ని సంతోష్ తట్టుకోలేక పోయాడు.
ఈ విషయమై కుమార్తో గొడవకు దిగాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. తన భార్య శైలజను నిలదీయడంతో తను కాదంటున్న వెంటపడుతూ వేధిస్తున్నాడంటూ చెప్పడంతో సంతోష్లో కోపం ఉగ్రస్థాయికి చేరింది. ఈక్రమంలో సోమవారం సంతోష్ ‘మాట్లాడుకుందాం రా’ అని కుమార్ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిలిచాడు. మార్కెట్ యార్డు ఆవరణలో తన భార్య, అక్కడున్నవారు చూస్తుండగానే కుమార్ను సంతోష్ కత్తితో నరికిచంపాడు. ఘటన స్థలాన్ని డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు లక్ష్మణావు, మల్లేశ్ పరిశీలించారు.
రమ్మని పిలిచి చంపేశారు..
పొలం కుమార్ ఇంట్లో ఉండగా సంతోష్కుమార్, శైలజ నుంచి ఫోన్ వచ్చిందని మృతుడి భార్య అనిత తెలిపింది. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే ‘సంతోష్, శైలజ తనతో మాట్లాడుతారట. వ్యవసాయ మార్కెట్యార్డుకు రమ్మంటున్నారు’. అని బయటకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోయాడని రోదించింది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వెంట పడుతున్నాడంటూ చెప్పి కోపం పెరిగేలా చేసిందని పేర్కొంది. అక్రమసంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దారుణంగా చంపారని విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Also read
- నేటి జాతకములు….12 నవంబర్, 2025
- Nandi in Shiva temple: శివాలయాల్లో
నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి? - శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
- Pune Crime: ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు
- Annamaya District:దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన





