పిల్లలు చికెన్ కావాలని అడిగినందుకు ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో పిల్లల్ని ఎడాపెడా కొట్టింది. దెబ్బలు తాళలేక హాస్పిటల్ పాలైయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 7ఏళ్ల కొడుకు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆదివారం చోటుచేసుకుంది.
కన్నకొడుకు చికెన్ కావాలని అడిగినందుకు ఓ తల్లి కన్నబిడ్డలపై కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఆ బాలుడిని ఎడాపెడా కొట్టింది. దెబ్బలు తాళలేక ఆ బాలుడు హాస్పిటల్ పాలైయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆదివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిన్మయ్ ధుమ్డే అనే బాలుడు తన తల్లి పల్లవి ధుమ్డేతో చికెన్ తినాలని ఉందని మారం చేశాడు. ఆగ్రహించిన ఆమె కొడుకు, కూతుర్ని రొట్టెల కర్రతో బాగా కొట్టింది. ఏడేళ్ల కొడుకు, పదేళ్ల కూతురు ఇద్దరు తల్లి కొట్టిన దెబ్బలకు తాళలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ కొడుకు మరణించాడు.
అరుపులు విన్న పొరుగువారు పోలీసులకు సమాచారం అందించగా, స్థానిక పోలీసులు, స్థానిక క్రైమ్ బ్రాంచ్, సబ్-డివిజనల్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితురాలు మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





