April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

మహిళపై హత్యాయత్నం పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వ్యక్తి

రాయదుర్గం(అనంతపురం) : అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… రాయదుర్గం పట్టణంలోని రాజీవ్‌ గాంధీ కాలనీలో నివసిస్తున్న పార్వతి, మోహన్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుండేది. ఇది వరకు మహిళ కుమార్తె పేరిట రూ.రెండు లక్షల డిపాజిట్‌ ఉండేది. మోహన్‌ ఈ డబ్బులు కావాలని చెప్పి కుమార్తెను తీసుకెని వెళ్లాడు. రెండు లక్షల రూపాయలు ఇస్తేనే కూతుర్ని ఇస్తానంటూ పార్వతికి చెప్పాడు. తాను డబ్బులు ఇస్తానని, తర్వాత తమ జోళికి రాకూడదని అతనితో ఒప్పందం చేసుకున్నారు. ఇదే సమస్యపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పొదుపు సంఘం సమావేశానికి పార్వతి వెళుతుండగా మోహన్‌, అతని సోదరుడు సిద్ధులు ఆమెపై దాడి చేశారు. తమతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను పోసి, నిప్పంటించారు. స్థానికులు గుర్తించి ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే 60 శాతం శరీరం కాలిపోయినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రభుత్వాసుపత్రికి వచ్చి పార్వతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం. శ్రీనివాసులు తెలిపారు.

Also read

Related posts

Share via