ప్రకాశం జిల్లా నల్లగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల్లో వ్యక్తిని హత్య చేశారు. పాతకక్షలతో వెంకటేశ్వర్లను గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. హత్య రాజకీయ కోణంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP Cirme: ప్రకాశం జిల్లా నల్లగుంట్ల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల సందడిలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటుండగా.. ఒక భయానక సంఘటన గ్రామాన్ని వణికించింది. పాతకక్షలు కారణంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ సంఘటన అక్కడి వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
పాతకక్షలతో వ్యక్తి దారుణ హత్య..
స్థానిక వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం జరిగిన మరో హత్యకేసుతో ఈ ఘటనకు సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో నల్లగుంట్ల సర్పంచ్ మొద్దు రమణమ్మ భర్తను దుండగులు హత్య చేసిన కేసులో వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచే ఈ ఘటనపై గ్రామంలో రగిలిన కక్షలు ఇప్పటివరకు శాంతించలేదు. పండుగ సందర్భంగా వెంకటేశ్వర్లు గ్రామంలో తిరుగుతుండగా అతనిపై రమణమ్మ అనుచరులు కాపుకాచి దాడికి తెగబడ్డారు. గొడ్డలితో నరికి అతన్ని హతమార్చారు
ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. సర్పంచ్ భర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేశ్వర్లుపై ఇలా పగ తీర్చుకున్న తరహాలో దాడి జరగడం రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా భావించవచ్చు. అయితే ఇది పూర్తిగా పాతకక్షల ఫలితమా? లేక అప్పటి రాజకీయ శత్రుత్వానికి కొనసాగింపేనా? అన్న విషయంపై పోలీసు శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి మృతుడి కుటుంబం సభ్యులు కోరుతున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025