ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరు గ్రామంలో పోసిన బాలకోటయ్య (52) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు నేపథ్యంలో ప్రత్యర్థులు పట్టపగలు నడిరోడ్డుపై బాలకోటయ్యను మారణ ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. కైకలూరు సిఐ కృష్ణ కిషోర్, మండపల్లి ఎస్‌ఐ రాంబాబు, ముదినేపల్లి ఎస్‌ఐ డి.వెంకట కుమార్ ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు చైతన్య ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణ కిషోర్ తెలిపారు. బాలకోటయ్య హత్య గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసింది.
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి