తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు… మణిపూర్ రాష్ట్రంలో ఈస్టర్ డే సెలవును రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై KVPS నిరసన వ్యక్తం చేసింది… మణిపూర్ రాష్ట్రంలో క్రిస్టియన్లమనోభావాలు దెబ్బతినేలా గుడ్. ఫ్రైడే అనంతర30.31తేదీల్లో సెలవుల్ని రద్దు చెయ్యటాన్ని KVPS తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వలరాంబాబు తీవ్రంగా ఖండించారు KVPS కార్యకర్తలు ఏర్పాటు చేసిన నిరసనలో పాల్గొని మాట్లాడారు రాంబాబు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మొత్తం 9జిల్లాలు వుండగా వీటిలో 5జిల్లాల్లో క్రైస్తవులు వున్నారు రాష్ట్రంలో 41.29శాతం క్రైస్తవ జనాభా వుందని వీరంతా కుకీ కమ్యూనిటీకి చెందిన వారు గుడ్ ఫ్రైడే అనంతరం శని ఆది వారాల్లో ఈస్టర్ ఘనంగా జరుపు కుంటారు దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని పక్కనబెట్టి మతోన్మాద శక్తులతో నడపబడుతున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కుల కోసం నిలబడవలసిందిపోయి. కంచే చేను మేసినట్లు క్రైస్తవులహక్కులపై దాడి చెయ్యటం అంటే రాజ్యాంగం మీద దాడి చెయ్యటమే అని రాంబాబు విమర్శించారు. వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025