July 2, 2024
SGSTV NEWS
CrimeTelangana

కూతురు కోసం వచ్చిన తండ్రి.. క్షణికావేశంలో ఎంత పనిచేశాడంటే!




Rangareddy Crime News: ఇటీవల కొంతమంది ప్రతి విషయానికి విచక్షణ కోల్పోయి ఆవేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో కోపంతో చేసిన తప్పు తెలుసుకున్నప్పటికీ జరగరాని నష్టం జరిగిపోతుంది.


ఈ మధ్య చాలామంది చిన్న చిన్న విషయాలకే తవ్రంగా స్పందిస్తున్నారు. కోపం, క్షణికావేశంలో దారునమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు.. కొన్నిసార్లు హత్యలు కూడా చేస్తున్నారు. చాలా వరకు కుటుంబ కలహాలు, ప్రేమ వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాలు దీనికి ప్రధాన కారణం అంటున్నారు పోలీసులు. క్షణికావేశంలో చేసిన తప్ప వల్ల ఎన్నో కుటుంబాల్లు ఇబ్బందుల్లో పడిపోతున్నాయి.  తాజాగా రంగారెడ్డి జిల్లాలో కూతురు‌ని చూడటానికి వచ్చిన తండ్రి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..


రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నివాసం ఉంటున్న తన కూతురిని చూడటానికి వచ్చిన తండ్రి కుటుంబ కలహాలతో క్షణికావేశంలో కూతురు అత్తని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక హిల్స్ లో నివాసం ఉంటున్న కొర్ర జయరామ్‌తో రెండేళ్ల క్రితం తన కూతురుని ఇచ్చి వివాహం జరిపించాడు కేసీ తండాకు చెందిన జటావత్ ప్రభు (45). పెళ్లి జరిగినప్పటి నుంచి వరుస గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక కూతులు పదే పదే తల్లిగారి ఇంటికి వస్తూ ఉండేది. ఆమెకు సర్ధి చెప్పి తిరిగి అత్తారింటికి పంపిచేవారు తల్లిదండ్రులు.

ఈ క్రమంలోనే మంగళవారం వినాయక హిల్స్ లో నివాసం ఉంటున్న తన కూతురని చూడటానికి భార్యతో కలిసి వెళ్లాడు ప్రభు. ఆ సమయంలో కూతురు కొర్ర లలిత (50) తో మాటా మాటా పెరగడంతో విచక్షణ కోల్పోయి ప్రభు అత్తని నెట్టివేశాడు. ఆమె కింద పడిపోయిన సమయంలో అక్కడే ఉన్న ఓ సుత్తితో తలపై బలంగా బాదాడు. అంతే తీవ్ర రక్తస్రావం అయి ఆమె అక్కడిక్కడే కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి ఆమె కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via