November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఆలయ స్థలం పై వివాదం..ఫిటిషనర్ గా హనుమంతుడి పేరు.. కోర్టు ఏం చేసిందంటే

సాధారణంగా ఎవరికైనా దేవుడి మీద చాలా భక్తి ఉండవచ్చు.  కానీ, ఆ భక్తి కాస్త పరాకాష్టకు మాత్రం చేరకూడదు. ముఖ్యంగా  ఈ భక్తి పేరిట లేనిపోని అక్రమాలు, మోసలు కూడా చేయకూడదు. కానీ, ఈ మధ్య కాలంలో దేవుడి పేరిట చాలా మోసాలు, ఘోరాలు జరుగుతునే ఉన్నాయి. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏకంగా ఓ వ్యక్తి దేవుడి పేరుతో ఓ స్థలన్ని అక్రమించాడు. అంతటితో  అగకూండా.. దేవడునే పిటిషనర్ గా పేర్కొంటూ.. కోర్టులో కేసు వేశాడు. అసలేం జరిగిందంటే..

ఈ మధ్యకాలంలో దేవుడి పేరిట చేస్తున్న మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ముఖ్యంగా దేవుడు, మతం వంటి పేర్లను ఉపాయోగించి చాలామంది చేస్తున్న అక్రమ నేరాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కాగా,ఇంతవరకు ఎక్కడైనా దేవుడు పేరిట డబ్బులను దోచుకోవడం, అమాయక ప్రజలను మోసం చేయడమే మాత్రమే చూశాం. అంతేకాకుండా ఈ దేవుడి పేరుతో చేస్తున్న మూఢనమ్మకాలు కూడా వింటు ఉన్నాం. కానీ, తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ సంఘటనలో మాత్రం ఓ వ్యక్తి దేవుడిని పేరును ఉపాయోగించి.. ఏకంగా ఓ స్థలాన్నే అక్రమించాలనుకున్నాడు. పైగా అందుకు కోర్టులో దేవుడినే తోటి పిటిషనర్ గా పేర్కొంటూ.. కేసు వేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా ఎవరికైనా దేవుడి మీద చాలా భక్తి ఉండవచ్చు.  కానీ, ఆ భక్తి కాస్త పరాకాష్టకు మాత్రం చేరకూడదు. ముఖ్యంగా  ఈ భక్తి పేరిట లేనిపోని అక్రమాలు, మోసలు కూడా చేయకూడదు. కానీ, ఈ మధ్య కాలంలో దేవుడి పేరిట చాలా మోసాలు, ఘోరాలు జరుగుతునే ఉన్నాయి. కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏకంగా ఓ వ్యక్తి దేవుడి పేరుతో ఓ స్థలన్ని అక్రమించాడు. అంతటితో  అగకూండా.. దేవడునే పిటిషనర్ గా పేర్కొంటూ.. కోర్టులో కేసు వేశాడు. అసలేం జరిగిందంటే.. దేవాలయ నిర్మాణం జరిగిన ఓ ప్రైవేటు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించిన అంకిత్ మిశ్రా అనే వ్యక్తి.. ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్‌గా పేర్కొంటూ కోర్టులో కేసు వేశాడు. పైగా ఆ  భూమి హనుమంతుడిదని, అది ఆయనకే చెందాలని, అలాగే ఓ భక్తుడిగా, స్నేహితుడిగా ఆ స్థలాన్ని సంరక్షించేందుకు తనకు హక్కులు కల్పించాలని కోరాడు. అయితే, ఈ పిటిషన్ ను అదనపు డిస్ట్రిక్ట్ కోర్టు తిరస్కరించడంతో .. అతడు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు.

అయితే దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సి.హరి శంకర్‌ ధర్మాసనం..ఆ స్థలాన్ని కాజేయాలనే స్వార్థంతో ఆ వ్యక్తి ఈ పిటిషన్ వేసినట్టు గుర్తించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా రూ.లక్ష జరిమానా విధించారు. అలాగే ప్రస్తుత యజమానులకు ఆ సొమ్ము చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే.. అంకితా మిశ్రా అనే వ్యక్తి మొదట హనుమంతుడ్ని సహ పిటిషనర్‌గా పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై అడిషనల్ డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి విచారణ చేపట్టారు. అయితే ఈ సందర్భంగా.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. మరొకరికి చెందిన ప్రైవేట్ భూమిలో నిర్మించిన మతపరమైన కట్టడం, అందులో ప్రతిష్టించిన దేవతను పూజించడానికి ఇతరులకు ఎటువంటి హక్కు ఉండదు’ అని పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లగా అక్కడ జస్టిస్‌ సి.హరి శంకర్‌ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఆయన కూడా ‘దేవుడు ఏదో ఒకరోజు నా ముందు పిటిషనర్‌గా ఉంటాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రతినిధి ద్వారా ఈ కేసులో అది జరిగింది.

ఇక ప్రయివేట్ స్థలంలో నిర్మితమైన ఆలయంలోకి భక్తుల ప్రవేశం, పూజలకు అనుమతించినా.. అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు. కేవలం పూజలకు అనుమతించినంత మాత్రాన అది పబ్లిక్ దేవాలయంగా మారిపోదు. కనుక  ఇది కేవలం ఆ స్థలాన్ని కాజేయాలనే కుట్రగా కనిపిస్తోంది’ అని జస్టిస్ శంకర్ అన్నారు. ఇక ఈ ఆలయాన్ని 1997లో నిర్మించారనే వాదన ఉన్నప్పటికీ దానికి కూడా ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఆలయంపై అంకిత్ మిశ్రాకు ఎటువంటి హక్కులేదని జిల్లా కోర్టు న్యాయమూర్తి చెప్పింది సరైందేనని జస్టిస్ హరిశంకర్ సమర్దించారు. మరి, దేవుడి పేరిట స్థలాన్ని ఆక్రమించి, దేవుడినే పిటిషనర్ గా కోర్టులో కేసు వేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Also read

Related posts

Share via