తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలిక కుటుంబం బాలుడిపై దాడి చేసి హతమార్చింది. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలుడిని చితక్కొట్టడంతో గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు
TG Crime: తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఓ బాలిక కుటుంబం బాలుడిపై దాడి చేసి హతమార్చింది. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన ఎండీ రిజ్వాన్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పదహారేళ్ల అతని కుమారుడు ఇటీవల జరిగిన పదవతరగతి పరీక్షల్లో పాసై ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. అయితే వేసవిసెలవుల్లో ఖాళీగా ఉండటం దేనికని క్యాటరింగ్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు
అందులో భాగంగా గురువారం ఉదయం సైనిక్‌పురిలో జరిగిన ఒక ఫంక్షన్‌కు అతని మిత్రులతో కలసి వెళ్లాడు. అనంతరం ఫంక్షన్ పూర్తి చేసుకుని బాలుడు అతడి ఇద్దరు మిత్రులతో కలసి రాధికా చౌరస్తా సమీపంలోని వీరారెడ్డి ఎన్ క్లేవ్ ఎదుట రోడ్డుపై నిలబడి ఉన్నారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో వారిలో ఒకరికి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఎదుటివారు మా అమ్మాయిని నిత్యం ఎందుకు వేధిస్తున్నారు? అంటూ పరుషంగా మాట్లాడారు. అంతేకాక మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. మీ సంగతి చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ బాలుడు తాము ఎక్కడ ఉన్నామో చెప్పాడు.
ఫోన్ కట్ చేసిన వారు రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వచ్చిరాగానే బాలుడిని అదే విషయమై నిలదీశారు. అనంతరం చితక్కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వారిని పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం ఘటనా స్థలాన్ని కుషాయిగూడ ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఎల్.భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ వెంకన్న పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. దాడి చేసిన వ్యక్తులు ఎవరు? అమ్మాయిని వేధించి ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు ఎవరనేది ఇంకా గుర్తించలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





