పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన రమేశ్‌కుమార్ ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా బండ రాయితో మోది హత్య చేశారు.
Ap Crime : పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన రమేశ్‌కుమార్ ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా బండ రాయితో మోది హత్య చేశారు. పనిమీద పక్కనే ఉన్న నన్నూరుకు వెళ్లిన ఆయన తిరిగి మీదివేముల గ్రామానికి వస్తుండగా గ్రామంలోని దర్గా వద్ద ఆయనను హత్య చేశారు. రమేష్ కుమార్ గతంలో మీదివేముల గ్రామ ఎంపీటీసీగా కూడా పనిచేశాడు. వైఎస్సార్ సీపీలో పనిచేస్తూ మాజీ ఎమ్మె్ల్యే రాంభూపాల్రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు.
నన్నూరి నుంచి మంచినీటి క్యాన్ తీసుకుని ద్విచక్ర వాహనంపై మీదివేములకు వస్తుండగా గ్రామ సమీపంలోని ఓ దర్గా వద్ద కాపుకాసిన దుండగులు ఆయనను హత్య చేశారు. ఆ ప్రాంతంలో వీధిదీపాలు లేకపోవడం, నిర్జన ప్రదేశం కావడంతో హత్యకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గతంలో కూడా పలు హత్యలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ దాడి చేస్తే బాధితులు తప్పించుకునే అవకాశం లేకపోవడం, బాధితులు అరిచిన గ్రామంలోకి వినపడకపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని హత్యలకు ఎంచుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు
రమేష్ వైసీపీలో పనిచేస్తున్నప్పటికీ టీడీపీ నేతలతో ఎలాంటి విభేదాల్లేవని గ్రామస్తులు అంటున్నారు. మీదివేముల గ్రామానికే చెందిన వైసీపీ నేత, కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డికి కూడా రమేష్ అనుచరుడిగా ఉన్నారు. మీదివేములకు ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామంగా గుర్తింపు ఉంది. మారిన పరిస్థితుల్లో చాలా కాలంగా ప్రశాంతంగా ఉంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రమేశ్‌కుమార్ హత్యకు గురికావడం కలకలం రేపింది. హత్య విషయంపై గురువారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. కాగా హత్య విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. రమేష్ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్‌లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





