నల్లగొండ..కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. పురుగులన్నం, నీళ్ల చారు ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. పురుగులన్నం, నీళ్ల చారు ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్‌లో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని తెలిపారు. ఇదేంటని అడిగితే ప్రిన్సిపాల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందని వాపోయారు. 400 మంది విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్లిపోతామని విద్యార్థినిలు హెచ్చరించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025