అమీన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. అదుపు తప్పడంతో పిల్లల పైకి కారు వెళ్లింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కాతమ్ముడు మైదానంలో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడిపిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పిల్లాడి తండ్రి శేఖర్ ఫిర్యాదుతో యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహేశ్వరి, రవిశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025