ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
మునగాల, : ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని జీడిమెట్ల నుంచి సుమారు 30మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యానాంకు బయలుదేరింది. మార్గమధ్యంలో మునగాల ప్రభుత్వ వైద్యశాల వద్ద అదుపు తప్పి డివైడర్ మీదుగా సర్వీస్ రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులోని నలుగురు క్షతగాత్రులను సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025