కందుకూరు: బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీకాకుళంకు చెందిన వనజాక్షి (27)కి కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెంకు చెందిన చిమటా శివకృష్ణతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గాయత్రీనగర్‌లో నివాసం ఉంటున్నారు. శివకృష్ణ ఆటో నడుపుకుంటుండగా, వనజాక్షి ఇంటి వద్దే బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా రు. పట్టణంలోని గుండంకట్ట ప్రాంతంలో వనజాక్షి తల్లిదండ్రులు నివా సం ఉంటున్నారు.
సోమవారం సాయంత్రం వనజాక్షికి తండ్రి నాగేశ్వరరావు ఫోన్ చేసినా తీయకపోవడంతో తెలుసుకునేందుకు కుమార్తె ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి చూడగా వనజాక్షి నిర్జీవంగా పడి ఉండడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నఫీజ్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సోమవారం మధ్యా హ్నం ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లు గమనించామని, ఈ క్రమంలో భర్తే వనజాక్షిని చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. భర్త శివకృష్ణ ఆచూకీ లేకపోవడం, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!