అక్కను వేధిస్తున్నాడన్న కక్షతో బావను దారుణంగా హత్య చేశాడు బావమరిది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వనస్థలిపురం డబుల్ బెడ్రూం ఇంట్లో నివాసముంటున్న హాజీపూర్ కు చెందిన వెంకటేశ్ 2015లో స్వప్న అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వెంకటేశ్ తన మకాంను ఎస్ఆర్ నగర్ కు మార్చాడు. మంగళవారం రాత్రి వనస్థలిపురం వచ్చి పిల్లలను చూపించమని స్వప్నను అడిగాడున. ఆ సమయంలో అక్కడ స్వప్న తమ్ముడు దుబ్బల పాండు కూడా ఉన్నాడు. పిల్లలను చూపించేది లేదని స్వప్న చెప్పటంతో గొడవ మొదలైంది.
దాంతో కోపంతో రెచ్చిపోయిన పాండు వెంకటేశ్ తలపై బరువైన వస్తువుతో బలంగా కొట్టాడు. దాంతో తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్ అక్కడికక్కడే మరణించాడు.
అనంతరం 7వ అంతస్తు నుంచి మృతదేహాన్ని కిందకు తెస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్వప్న, పాండుతోపాటు అతనిస్నేహితుడు జగదీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసును వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





