SGSTV NEWS online
CrimeTelangana

Hayathnagar: ఫోన్‌ చూడొద్దని తల్లి మందలించిందని.. తనువే చాలించింది..



ఈఎంఐలో కొత్త సెల్‌ఫోన్‌ కొనుక్కున్నప్పటి నుంచి దానితోనే ఎక్కువ సమయం గడుపుతున్న కుమార్తెను తల్లి మందలించింది. ఇంటి పనులు పట్టించుకోకుండా ఫోన్‌ చూస్తూ ఉంటే ఎలా అంటూ హితవు పలికింది. దీంతో మనస్తాపానికి గురైన 25 ఏళ్ల వివాహిత లక్ష్మిదేవి ఆత్మహత్యకు పాల్పడింది.


చేతిలోకి కొత్త ఫోన్ వచ్చిందంటే దానితోనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. ఇది గమనించిన తల్లి.. ఫోన్ చూస్తూ ఉంటే ఎలా బిడ్డా.. ఇంటి పనులు కూడా చూసుకోవాలి కదా అంటూ మందలించింది. తల్లి మాటలతో మనస్తాపానికి గురైన 25 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.


నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామానికి చెందిన కిష్ణయ్య, అలివేలు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె లక్ష్మిదేవి (25)కి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం టీపీగౌరారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి కోసం నగరానికి వచ్చిన వీరు హయత్‌నగర్‌ బొమ్మలగుడి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు, లక్ష్మిదేవి తల్లిదండ్రులు కూడా వారితోనే ఉంటున్నారు. భర్త పెయింటింగ్‌ పనులు చేస్తుండగా, ఆమె ఇళ్లలో పనులకు వెళ్తోంది.

ఇటీవల భర్త ఈఎంఐ పద్ధతిలో లక్ష్మిదేవికి సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆమె ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతోంది. దీంతో గురువారం తల్లి అలివేలు ఆమెను మందలించింది. ఫోన్‌ చూస్తూ ఉంటే పనులు ఎలా అవుతాయి.. ఏదో ఒక పని చేసుకోవాలి కదా అంటూ హితవు పలికింది.


శుక్రవారం ఉదయం భర్త పనికి వెళ్లిన తర్వాత లక్ష్మిదేవి ఏడేళ్ల కుమార్తెను పాఠశాలకు పంపలేదు. మూడేళ్ల కుమారుడిని అక్కతో కలిసి టీవీ చూడమని చెప్పి గదిలోకి వెళ్లింది. అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది.

Also read

Related posts