హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర వెళ్లిన క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు పదో అంతస్తు బాల్కనీ నుంచి దూకేందుకు ప్రయత్నించడంతో చాలాసేపు ఉత్కంఠ నెలకొన్నా చివరకు అతడ్ని పట్టుకున్నారు. హైదరాబాద్ లొ ఎన్టీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులో మతీన్ నిందితుడు. ఏడు నెలలుగా పరారీలో ఉన్న అతడు మహారాష్ట్ర ఠాణెలో ఉన్నట్లు సమాచారం అందింది. హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ వారెంటుతో అక్కడికి వెళ్లారు. స్థానిక కాశీమీరా పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో మతీన్ కోసం సోమవారం మీరారోడ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడి అపార్టుమెంట్లోని పదో అంతస్తులో ఉన్న నిందితుడి ఇంటి తలుపు తట్టారు. పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన అతడు తప్పించుకునే క్రమంలో బాల్కనీ గ్రిల్స్ నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడితో మాట్లాడుతూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అక్కర్ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాల్కనీ పక్కన వల ఏర్పాటు చేశారు. కొందరు పోలీసులు అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి అతడిని పట్టుకున్నారు. ఠాణె న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం హైదరాబాద్ కు తీసుకురానున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025