ఆ కామాంధుడు.. మాకొద్దు..!సైన్స్ టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నాపాఠశాల ఆవరణలో ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు- సత్యవేడు : తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడు ఫిజికల్ సైన్స్ టీచర్ మాకొద్దంటూ మంగళవారం స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కమిటీ మాజీచైర్మన్ సురేష్, ఆనందయ్య మాట్లాడుతూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా శ్యాముల్ జాన్ పనిచేస్తున్నారని, ఇక్కడ టీచరుగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి బాలికల పట్ల శ్యాముల్ జాన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. 2019లో బాలికల పట్ల శ్యాముల్‌జాన్ ప్రవర్తనపై సంబంధిత ప్రధానోపాధ్యాయులకు గ్రామయువకులు కొందరు మౌఖికంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై అప్పట్లోనే టీచర్ల సమావేశం నిర్వహించి హెచ్‌ఎం సంబంధిత టీచర్‌కు హెచ్చరికలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇంత జరిగినా సదరు టీచర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత విద్యాసంవత్సరం హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బయటపడడంతో సంబంధిత హాస్టల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చినబాబుకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌జిల్లా విద్యాశాఖ అధికారి దష్టి తీసుకెళ్లడం జరిగింది
Also read
- Andhra: బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్…. M
- Telangana: భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..
- Crime: తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య
- Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!
- గుంటూరు: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే