SGSTV NEWS
CrimeTelangana

TG Murder: భూ వివాదంలో తండ్రి హతం.. పగతో పెద్దమ్మను గొడ్డలితో నరికిన కొడుకు!


తెలంగాణ భూపాలపల్లిలో భయంకరమైన మర్డర్ అటెంప్ట్  జరిగింది. భూ వివాదంలో తన తండ్రిని చంపిన నిందితురాలు లక్ష్మీపై కాటారం పోలీస్ స్టేషన్‌లోనే అంజి గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరారిలో ఉన్న నిందితుడికోసం గాలిస్తున్నారు


TG Murder: తెలంగాణలో భయంకరమైన మర్డర్ అటెంప్ట్  జరిగింది. భూ వివాదంలో తన తండ్రిని చంపిన కుటుంబంపై పగతో రగిలిపోతున్న కొడుకు పోలీస్ స్టేషన్ ముందే దారుణానికి పాల్పడ్డాడు. అందరు చూస్తుండగానే తన పెద్దమ్మ కుటుంబంపై దాడికి ప్రయత్నించాడు. మహిళను గొడ్డలితో నరికేశాడు. రోడ్డుమీద రక్తం ఎరులైపారుతుండగా స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

5 గుంటల భూ వివాదంలో..
ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా దేవరంపల్లి గ్రామానికి చెందిన  మార్పాక సారయ్యను.. 5 గుంటల స్థలం వివాదంలో 2024 డిసెంబర్ 14న లక్ష్మీతో పాటు మరో ముగ్గురు చంపేశారు. అయితే తండ్రి హత్యపై పగతో రగిలిపోతున్న సారయ్య కొడుకు అంజి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే జైలు నుంచి విడుదలైన లక్ష్మీ.. కాటారం పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టేందుకు వెళ్లింది. అది గమనించిన అంజి.. మంగళవారం మిట్ట మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ముందే గొడ్డలితో నరికాడు. స్థానికులు అంజిని అడ్డుకుని లక్ష్మీని ఆస్పత్రికి తరలించారు

బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఆ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని ప్రయత్నించిన అంజి.. ఆ తర్వాత వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. అతనిపై కేసు నమోదు చేసి గాలింపు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read

Related posts

Share this