SGSTV NEWS
Spiritual

Tulasi Puja Tips: తులసి మొక్క పూజకు నియమాలున్నాయి.. ఈ రోజుల్లో పొరపాటున కూడా నీరు పోయవద్దు.. ఎదుకంటే..



హిందూ మతంలో ప్రకృతిని దైవంగా భావించి పుజిస్తారు. రావి, జమ్మి, తులసి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. మరోవైపు తులసి మొక్క శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రియమైనది. లక్ష్మీ దేవి తులసి నివాసం. సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళ తులసి మొక్కడ దగ్గర దీపం వెలిగించి పూజించడం వల్ల కుటుంబానికి ఆనందం, శాంతి, సంపద లభిస్తాయి.


హిందువులు ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నీరు సమర్పించి పూజిస్తారు. అంతే కాదు తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి రోజూ పూజ చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. విష్ణు ప్రియ తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభ ప్రదం అని.. ఇంటికి సానుకూల శక్తిని తెస్తుందని నమ్మకం. అయితే తులసి మొక్క పూజకు కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా తులసి మొక్క్డకు నీరు సమర్పించే విషయంలో కొని నిషేధాలున్నాయి. అవును తులసి మొక్కకి రోజూ నీరు సమర్పించకూడదని మీకు తెలుసా..

అవును.. చాలా మంది రోజూ తులసి మొక్కకు రోజూ నీరు సమర్పిస్తారు. పుజిస్తారు. అయితే తులసి మొక్కకు రోజులో ఉదయం, సాయంత్రం పూజ చేయడం ఆచారం అయినప్పటికీ.. హిందూ మత విశ్వాసాల ప్రకారం, మంగళవారాలు, ఆదివారాలు, ఏకాదశి రోజులలో తులసి మొక్కకు నీటిని సమర్పించడం నిషేధించబడింది. ఈ మూడు రోజులలో తులసి మొక్కకు నీరు సమర్పించరాదు. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. లక్ష్మీ దేవి ఆదివారాలు, ఏకాదశి తిధిలో శ్రీ హరి అనుగ్రహం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండేదని ప్రస్తావించబడింది. తులసి లక్ష్మి స్వరూపం కనుక ఆదివారాలు, ఏకాదశి నాడు తులసి మొక్కకి నీరు పెట్టడం వల్ల ఉపవాసం విరమించినట్లు అవుతుంది. కనుకనే ఈ రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయరాదు. ఇలా చేయడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. అలాగే మంగళవారం తులసికి నీరు పోయడం వలన శివుడికి కోపం వస్తుంది.

తులసి మొక్కని ఎప్పుడు నాటాలి?
మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో తులసి మొక్కను నాటడానికి గురువారం, శుక్రవారం ఉత్తమ రోజులుగా భావిస్తారు. ఈ రోజున తులసిమొక్కను నాటడం వలన భక్తులకు శుభ ఫలితాలు లభిస్తాయి. లక్ష్మీదేవి త్వరగా సంతోషించింది.



తులసి దళాలను తెంపవద్దు
ఏకాదశి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సమయంతో పాటు సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి దళాలను తెంపరాదు. ఎందుకంటే ఈ రోజుల్లో తులసి దేవి విష్ణువు ని పూజిస్తూ నీరు లేకుండా ఉపవాసం ఉంటుంది. కనుక ఈ రోజున తులసి దళాలను మొక్క నుంచి తెంపవద్దు.

Related posts

Share this