పెళ్లైన రెండు రోజులకే వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. బడంగ్ పేట్ లోని లక్ష్మీదుర్గకాలనీకి చెందిన విశాల్(25) కు 2025 ఆగస్టు 07వ తేదీన పెళ్లి అయింది. తెల్లవారుజామున వధువుతో కలిసి ఇంటికి చేరుకోగానే అతనికి గుండెపోటు వచ్చింది
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. బడంగ్ పేట్ లోని లక్ష్మీదుర్గకాలనీకి చెందిన విశాల్(25) కు 2025 ఆగస్టు 07వ తేదీన పెళ్లి అయింది. తెల్లవారుజామున వధువుతో కలిసి ఇంటికి చేరుకోగానే అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆసుసత్రికి తరలించారు.అక్కడ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విశాల్ కన్ను్మూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికంగా ఈ ఘటన అందర్ని కలిచివేసింది. అటు మెదక్ జిల్లా అంసాన్‌పల్లి గ్రామంలో ఒక 22 ఏళ్ల వరుడు పెళ్లైన రెండు వారాల తర్వాత గుండెపోటుతో మరణించాడు. సాయికిరణ్ అనే ఆ యువకుడు పెయింటర్‌గా పని చేసేవాడు. స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లినప్పుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
మూడు రోజుల క్రితమే వివాహం
ఇటీవల కరీంనగర్ జిల్లా తిమ్మాపురంలో తీవ్ర విషాదమైన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి మూడు రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే ఈరోజు పరీక్ష రాసేందుకు భర్తతో కలిసి తిమ్మాపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి బైక్ పై వెళ్ళింది. కానీ.. ఇదే తనకు ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయింది. పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ఈ నవ దంపతులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. LMD దగ్గర వీరు వెళ్తున్న బైక్ ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల అక్కడిక్కడే మృతి చెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పెళ్ళైన మూడు రోజులకే నవ వధువు మృతి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి తర్వాత పిల్లాపాపలతో సంతోషంగా ఉంటుందనుకున్న కూతురు ఇక లేదని తెలియడంతో అఖిల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అటు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని మణికంఠనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవవధువు హర్షిత (20) పెళ్లి జరిగిన రోజే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. కృష్ణమూర్తి-వరలక్ష్మి దంపతుల కుమార్తె అయిన హర్షితకు ఆగస్టు 4న ఉదయం కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే సాయంత్రం హర్షిత తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హర్షిత (Harshita) మృతదేహాన్ని వెంటనే పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు మరణాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటివి దీనికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





