పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఓ నిండు గర్భిణి ప్రాణమే పోయింది. ఈ ఘటన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య రేణుక చనిపోయినట్లుగా భర్త నరేందర్‌తో పాటు ఆమె బంధువులు ఆరోపించారు.
పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఓ నిండు గర్భిణి ప్రాణమే పోయింది. ఈ ఘటన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ వెల్లడించిన వివరాల మేరకు.. రాజాపూర్ మండలం మల్లేపల్లికి చెందిన రేణుక (24)ను నవాబుపేట మండలం పల్లెగడ్డకు చెందిన నరేందర్‌కు పెళ్లి జరిగింది. వీరు హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఉంటున్నారు. అయితే రేణుక గర్భవతి కావడంతో మొదటి కాన్పు కోసం ఆమె తల్లిదండ్రులు శుక్రవారం జడ్చర్ల ఇందిరానగర్ కాలనీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు
రాత్రివేళ రేణుకకు ఆకస్మికంగా ఫిట్స్
అయితే అక్కడ లేడీ డాక్టర్ ఆమెను పరీక్షించి జాయిన్ చేసుకున్నారు. రాత్రివేళ రేణుకకు ఆకస్మికంగా ఫిట్స్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రి వైద్యురాలు మెరుగైన వైద్యం కోసం తన వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ డాక్టర్లు రేణుకకు పరీక్షలు నిర్వహించి అప్పటికే చనిపోయినట్లుగా వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య రేణుక చనిపోయినట్లుగా భర్త నరేందర్‌తో పాటు ఆమె బంధువులు ఆరోపించారు. తన భార్యకు ఎప్పడూ ఫిట్స్ రాలేదని నరేందర్ తెలిపారు.
కానీ ఫిట్స్ వచ్చినట్లు తనకు ఫోన్‌లో తెలిపారన్నారు. విషయం తెలుసుకుని తాను ఆస్పత్రికి వచ్చే సరికే పేషంట్ కండీషన్ సీరియస్‌గా ఉందంటూ జిల్లా ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. అయితే వైద్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని.. పరిస్థితి విషమంగా ఉండటంతో తన కారులో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్లు అంటున్నారు. రేణుక మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో