కామారెడ్డి జిల్లా ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మిస్సింగ్ కేసులో ఎస్సై మృతదేహం కూడా దొరికింది. గత రాత్రే అడ్లూరు చెరువులో కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభించిన సంగతి తెలిసిందే.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన లో ఎస్సై మృతదేహం కూడా పోలీసులకు దొరికింది.
గత అర్థరాత్రి సమయానికే శ్రుతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు..ఎస్సై ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నేటి ఉదయం ఎస్సై మృతదేహం కూడా లభ్యమైంది.
వివరాల్లోకి వెళ్తే..భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే అర్థరాత్రి సమయం దాటిన తరువాత కానిస్టేబుల్ శృతితో పాటు మరో యువకుడు నిఖిల్ శవం కూడా లభ్యమైన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ శృతితో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఆత్మహత్యలు జరిగినట్లు తెలుస్తుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్సైగా సాయి కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్ లొ కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. అప్పటికే ఎస్సైకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా.. శృతికి కూడా పెళ్ళై విడాకులు అయినట్లు సమాచారం.
ఎస్సై బదిలీ పై బిక్కునూర్ రావడంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో శృతికి సన్నిహితం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే…బీబీపేట ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకి వచ్చారు. మధ్యాహ్నమైనా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్ లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు వారు చెప్పడంతో కంగారు పడిన శ్రుతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు.
ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగరం్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవరాం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శ్రుతి సెల్ తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది. భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ కు చెందిన కారు, చెప్పులు, నిఖిల్ చెప్పులు కనిపించాయి.
అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయట పడ్డాయి. ఈ క్రమంలోనే నేటి ఉదయం ఎస్సై మృతదేహం కూడా లభ్యమైంది.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!