అఘోరీ అలజడి.. ఆంధ్రా నుంచి తెలంగాణకు మళ్లింది. టోల్గేట్ పేమెంట్ విషయంలో గొడవ చెలరేగింది. దీంతో తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. అఘోరీ నానా హంగామా చేశారు.
అఘోరీ అలజడి తెలంగాణ నుంచి ఏపీకి మళ్లింది. అనకాపల్లిలోని నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర అఘోరీ నానా హంగామా చేసింది. టోల్గేట్ పేమెంట్ విషయంలో అఘోరీకి.. అక్కడి సిబ్బందికి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. కాసేపటికి పేమెంట్ లేకుండానే కారుని ముందుకు వెళ్లనిచ్చారు టోల్‌ప్లాజా సిబ్బంది. కార్ యూటర్న్ తీసుకుని వచ్చి మళ్లీ గొడవకు దిగారు అఘోరీ. టోల్‌ప్లాజా సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో రెండున్నర గంటలపాటు నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర హైడ్రామా నడిచింది. టోల్‌ప్లాజాలో సీసీ ఫుటేజ్ ఇవ్వాలని అఘోరీ డిమాండ్ చేశారు. సీసీఫుటేజ్ ఇచ్చిన తర్వాత అక్కడున్నవారికి శాపనార్థాలు పెట్టారు. తనను కావాలని తాకి సారీ చెబుతున్నారని బిగ్గరగా ‘మీకు చేతనైంది మీరు చెయ్యండి, నాకు చేతేనైంది నేను చేస్తా’నని అక్కడివారికి వార్నింగ్ ఇచ్చారు
Also read
- గొంతునులిమి.. ప్రాణం తీసి..
- గే డేటింగ్ యాప్‌లో పరిచయం.. తియ్యని మాటలతో యువకుడి కొంపముంచిన కేటుగాడు..
- Cyber Fraud: పోలీసు కానిస్టేబుల్‌కే టోకరా.. రూ.29 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు.. సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు!
- హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!
- Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్





