SGSTV NEWS online
Andhra Pradesh

Aghori: తెలంగాణ నుంచి ఏపీకి మళ్లిన అఘోరీ అలజడి.. టోల్‌ప్లాజా దగ్గర హంగామా

అఘోరీ అలజడి.. ఆంధ్రా నుంచి తెలంగాణకు మళ్లింది. టోల్‌గేట్ పేమెంట్‌ విషయంలో గొడవ చెలరేగింది. దీంతో తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. అఘోరీ నానా హంగామా చేశారు.


అఘోరీ అలజడి తెలంగాణ నుంచి ఏపీకి మళ్లింది. అనకాపల్లిలోని నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర అఘోరీ నానా హంగామా చేసింది. టోల్‌గేట్ పేమెంట్ విషయంలో అఘోరీకి.. అక్కడి సిబ్బందికి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది.  కాసేపటికి పేమెంట్‌ లేకుండానే కారుని ముందుకు వెళ్లనిచ్చారు టోల్‌ప్లాజా సిబ్బంది. కార్ యూటర్న్ తీసుకుని వచ్చి మళ్లీ గొడవకు దిగారు అఘోరీ.  టోల్‌ప్లాజా సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో  రెండున్నర గంటలపాటు నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర హైడ్రామా నడిచింది. టోల్‌ప్లాజాలో సీసీ ఫుటేజ్ ఇవ్వాలని అఘోరీ డిమాండ్ చేశారు.  సీసీఫుటేజ్ ఇచ్చిన తర్వాత అక్కడున్నవారికి శాపనార్థాలు పెట్టారు. తనను కావాలని తాకి సారీ చెబుతున్నారని బిగ్గరగా ‘మీకు చేతనైంది మీరు చెయ్యండి, నాకు చేతేనైంది నేను చేస్తా’నని అక్కడివారికి వార్నింగ్‌ ఇచ్చారు

Also read

Related posts