వెల్దుర్తి మండలం జాతీయ రహదారి 44 ప్రక్కనగల చెరుకులపాడు క్రాస్ రోడ్డు లో ఒక ఇంటిలో క్షుద్ర పూజలు కలకలం చెలరేగింది. ఇంటిలో క్షుద్ర పూజలు చేసిన వారి ఫోటోలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పట్టణానికి చెందిన ఒక వ్యక్తి సూత్రధారిగా ఉన్నట్టుగా సమాచారం.
కర్నూలు పట్టణంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. వెల్దుర్తి మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న చెరుకులపాడు క్రాస్ రోడ్డులో ఓ ఇంట్లో క్షుద్రపూజలు జరిగినట్లు ఆ ప్రాంతంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో క్షుద్ర పూజలు చేశారంటూ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండడంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొంతమంది అందులో చేతబడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పు ఎగ్గొట్టేందుకు ఆ వ్యక్తి ఇలా చేయిస్తున్నాడంటూ ఆ ప్రాంతంలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గుప్త నిధుల కోసం పూజలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025