April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshTrending

చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా మైండ్ బ్లాంక్!

మత్స్యకారులు వేటకు వెళ్లిన ప్రతిసారీ ఎన్నో ఆశలతో వలవేస్తారు. అన్నిసార్లూ వలలో చేపలు చిక్కకపోవచ్చు. కానీ ఒక్కోసారి మాత్రం మత్స్యకారుల ఊహకు అందని విధంగా అరుదైన చేపలు చిక్కుతుంటాయి. మత్స్యకారుల ఇంట సిరులు కురిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్‌లో. మత్స్యకారుల వలలో ఏకంగా 28 కచిడీ చేపలు చిక్కాయి. దాంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఏప్రిల్‌ 15వ తేదీన మత్స్యకారుల వలకు ఈ చేపలు చిక్కాయి. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మత్స్యకారులకు చిక్కిన చేపలలో ఒక చేప ఏకంగా 30 కేజీల బరువు తూగింది. దానిని ఓ దళారి రూ.3,25,000లకు పాటలో దక్కించుకున్నాడు. మిగతా చేపలు 37,75,000 లకు ఇతర దళారులు దక్కించుకున్నారు. మొత్తానికి 28 కచిడీ చేపలు రూ 41,00,000లకు అమ్ముడుపోయాయి. దీంతో మత్స్యకారులు ఆనందంలో మునిగిపోయారు. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయి. ఈ చేపల బ్లాడర్‌ను ఔషధాల తయారీలోనూ, ఖరీదైన వైన్‌ తయారీలోనూ వినియోగిస్తారట. అందుకే ఈ చేపలకు అంత డిమాండ్‌ ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపలు వలలో చిక్కితే వారి పంట పండినట్టే అంటున్నారు

https://youtu.be/-wRVBlGEIbo?si=_eiwRcRd16eDmukt

Also read

Related posts

Share via