మత్స్యకారులు వేటకు వెళ్లిన ప్రతిసారీ ఎన్నో ఆశలతో వలవేస్తారు. అన్నిసార్లూ వలలో చేపలు చిక్కకపోవచ్చు. కానీ ఒక్కోసారి మాత్రం మత్స్యకారుల ఊహకు అందని విధంగా అరుదైన చేపలు చిక్కుతుంటాయి. మత్స్యకారుల ఇంట సిరులు కురిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్‌లో. మత్స్యకారుల వలలో ఏకంగా 28 కచిడీ చేపలు చిక్కాయి. దాంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఏప్రిల్ 15వ తేదీన మత్స్యకారుల వలకు ఈ చేపలు చిక్కాయి. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మత్స్యకారులకు చిక్కిన చేపలలో ఒక చేప ఏకంగా 30 కేజీల బరువు తూగింది. దానిని ఓ దళారి రూ.3,25,000లకు పాటలో దక్కించుకున్నాడు. మిగతా చేపలు 37,75,000 లకు ఇతర దళారులు దక్కించుకున్నారు. మొత్తానికి 28 కచిడీ చేపలు రూ 41,00,000లకు అమ్ముడుపోయాయి. దీంతో మత్స్యకారులు ఆనందంలో మునిగిపోయారు. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయి. ఈ చేపల బ్లాడర్‌ను ఔషధాల తయారీలోనూ, ఖరీదైన వైన్ తయారీలోనూ వినియోగిస్తారట. అందుకే ఈ చేపలకు అంత డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపలు వలలో చిక్కితే వారి పంట పండినట్టే అంటున్నారు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





