April 8, 2025
SGSTV NEWS
CrimeTelangana

అయ్యో పాపం… ఆకలిగా ఉందని ఎగ్ బోండా తిన్నాడు.. చివరకు ప్రాణాలే పోయాయిగా..

చిత్ర విచిత్ర కారణాలు మనిషిని మరణానికి దగ్గర చేస్తున్నాయి. గొంతులో ఆమ్లెట్‌, మాంసం ముక్క, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి నోట్లో కోడిగుడ్డు ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు. అవును, మీరు చదివింది నిజమే..


పుట్టిన వాడికి మరణం తప్పదు.. ఇది అక్షర సత్యం.. అయితే, ఆ చావు మనిషిని ఎటు నుంచి ఆవహిస్తుందే చెప్పడం కష్టం. కరోనా అనంతరం కాలంలో ఊహించని మరణాలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. చిత్ర విచిత్ర కారణాలు మనిషిని మరణానికి దగ్గర చేస్తున్నాయి. గొంతులో ఆమ్లెట్‌, మాంసం ముక్క, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి నోట్లో కోడిగుడ్డు ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు. అవును, మీరు చదివింది నిజమే.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జరిగింది ఈ విషాద సంఘటన..పూర్తి వివరాల్లోకి వెళితే..


నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని బిజనపల్లి మండలం నందివడ్డెమాన్ కు చెందిన తిరుపతయ్య(50) అనే వ్యక్తి మృతి చెందాడు. చెన్నంపల్లి చౌరస్తా వద్ద ఓ బజ్జీల బండి వద్ద ఎగ్ బజ్జి తింటుండగా ఈ ఘటన జరిగింది. గొంతులో గుడ్డు ఇరుక్కోవడంతో శ్వాస ఆడక అక్కడిక్కడే మృతిచెందాడు తిరుపతయ్య

Also read

Related posts

Share via