ఈ ప్రమాదంలో విజయ షాపింగ్ మాల్ తో పాటు పక్కనే ఉన్న లక్ష్మి షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే SBK ATM ఉండడంతో బ్యాంక్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను
జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనగామ పట్టణంలోని విజయ షాపింగ్ మాల్ లో ఈ తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. షాపింగ్ మాల్ లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కొద్ది సమయంలోనే పక్కన ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే పక్క షాపులకు విస్తరించాయి. స్థానికులు, చుట్టుప్రక్కల ప్రాంతాల వారు అప్రమత్తమై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఈ ప్రమాదంలో విజయ షాపింగ్ మాల్ తో పాటు పక్కనే ఉన్న లక్ష్మి షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే SBK ATM ఉండడంతో బ్యాంక్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. సమయానికి ఫైర్ సిబ్బంది మాటలు అర్పడంతో చుట్టుపక్కల షాప్ ల వారు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీస్ లు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూలే కారణమా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!