April 10, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: కనిపించకుండాపోయిన యువతి.. తెల్లాసరికల్లా బ్రెయిన్ డెడ్‌తో ఆసుపత్రిలో ప్రత్యక్షం..!

యువతి బ్రెయిన్ డెడ్‌కు గురవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌కి యువతిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కనిపించకుండాపోయిన యువతి ఆసుపత్రిలో అపస్మాకరస్థితిలో దర్శనమిచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. మధిర సహన అనే యువతిని.. నవీన్ అనే రౌడీ షీటర్ నిన్న కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత యువతిని తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రిలో సహనను చేర్పించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చెప్పిన నవీన్.. అక్కడ నుంచి పారిపోయాడు. యువతి ఆస్పత్రిలోకి వచ్చే సరికే బ్రెయిన్ డెడ్ అయి ఉందని వైద్యులు చెబుతున్నారు.


కూతురిని రక్షించుకొనేందుకు తెనాలి సహా గుంటూరు, మంగళగిరిలోని పలు ఆసుపత్రులకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. చివరికి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు కూడా తీసుకెళ్లారు. అయితే యువతి బ్రెయిన్ డెడ్‌కు గురవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌కి యువతిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని నవీన్ ఎక్కడికి తీసుకెళ్లాడు.. ఎందుకు తీసుకెళ్లాడు.. యువతి బ్రెయిన్ డెడ్ ఎలా అయింది..? అనే కోణంలో విచారిస్తున్నారు. నవీన్‌పై వల్లభాపురం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కూడా ఉంది

Also read

Related posts

Share via