మద్యం మత్తులో కొంతమంది చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాం?.. ఎక్కడున్నాం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనే కనీసం సోయి కూడా ఉండదు. చేసేది తప్పు అని.. ఇతరులు ఎంత మొత్తుకొని చెప్పినా వినరు. తాజాగా ఏపీలో ఓ యువకుడు ఇంట్లో వాళ్లతో గొడవపడి కరెంట్ పోల్ ఎక్కాడు.
ఈ తాగుబోతులతో పెద్ద పరేషాన్ అయిపోయింది. తాగినోళ్లు చక్కగా పడుకుంటే ఓకే..కానీ లోపలికి వెళ్లిన సరుకు నిమ్మళంగా పడుకొనిస్తదా..?. అందుకే కాస్త పడ్డాక యాక్షన్‌లోకి దిగిపోతున్నారు మందుబాబులు. కొన్నిసార్లు వాళ్లు చేసే పనులు నవ్వు తెప్పించినా.. మరికొన్నిసార్లు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇటీవల ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఓ వ్యక్తి ఫుల్లుగా మందేసి పల్లె వెలుగు బస్సు పైకి ఎక్కి ఆదమరచి పడుకున్నాడు. అతడిని ఎవరూ గమనించకపోవడంతో.. ఆ బస్సు చాలా దూరం వెళ్లింది. కొంతదూరం వెళ్లాక.. స్థానికులు గమనించి.. బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో.. బస్సు ఆపి ఆ తాగుబోతును కిందకు దించారు. ఆ తాగుబోతుకు ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే నిద్రలో ఎక్కడైనా జారీ పడితే.. లేదా ఏదైనా కరెంట్ వైర్ తగిలి ఉంటే..? ఎంత డేంజరో.
ఆ తాగుబోతు అట్లుంటే.. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం అనే ఊర్లో ఉండే ఓ తాగుబోతు పుల్లుగా మందు కొట్టి.. ఆ మైకంలో కరెంట్ పోల్ ఎక్కాడు. దీంతో ఊర్లో వాళ్లంతా అలెర్టయి.. హుటాహుటిన వెళ్లి ట్రాన్స్‌ఫారమ్ ఆఫ్ చేశారు. ఆ పోల్ మీద.. కోతులు, కొండముచ్చులు వేలాడినట్లు వేలాడాడు. తొలుత స్థానికులు ఎంత చెప్పినా అతడు దిగి రాలేదు. దీంలో లోకల్ వాళ్లు రివర్స్ అటాక్ చేశారు. నువ్వు చస్తే చస్తావ్.. మేమైతే కరెంట్ ఆన్ చేసేందుకు పోతున్నాం.. అట్లనే పోలీసులకు కూడ ఫోన్ చేశాం. వాళ్లు వచ్చారంటే నువ్వు జైలుకు పోతావ్… అనేసరికి భయం అయి.. పోల్ దిగి.. అక్కడి నుంచి జారుకున్నాడు.
Also read
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..





